bandla ganesh: రాజకీయాలంటే భయమేసింది.. నాన్న చెప్పిందే కరెక్ట్: బండ్ల గణేష్

  • రాజకీయాల్లో ఉంటే అన్నీ అబద్ధాలే చెప్పాలి
  • పాలిటిక్స్ లో ఉంటే అడ్రస్ గల్లంతవుతుంది
  • అందరితోను శత్రుత్వం పెంచుకోవాలి

రాజకీయాలకు తాను పనికిరానని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, అధికార ప్రతినిధి పదవిని చేపట్టి 6 నెలలు కూడా గడవకముందే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో రాజకీయాలు చేయలేననే భయం వేసిందని చెప్పారు. తొందరపడి రాజకీయాల్లోకి వచ్చానేమోనని అనిపించిందని తెలిపారు. రాజకీయాల్లో కొనసాగితే అడ్రస్ గల్లంతవుతుందనే విషయాన్ని గ్రహించానని చెప్పారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నానని తెలిపారు.

రాజకీయాల్లో ఉంటే అన్నీ అబద్ధాలు చెబుతూ ఉండాలని, అందరితోను శత్రుత్వం పెంచుకోవాలని బండ్ల గణేశ్ అన్నారు. అన్ని పార్టీల్లో తనకు మిత్రులున్నారని, ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పారు. రాజకీయాల్లో నటించే బదులు సినిమాల్లో నటిస్తేనే బెటర్ అని అన్నారు. రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ చేయవచ్చు అనుకున్నానని, కానీ తన సేవ కూడా చేసుకోలేకపోయానని చెప్పారు.

రాజకీయాలకు నీవు పనికిరావని నాన్న చెబితే తాను పట్టించుకోలేదని... ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అని తెలిసిందని బండ్ల గణేశ్ అన్నారు. బ్లాక్ లో సినిమా టికెట్లు కొనుక్కోవచ్చు కానీ, శత్రువులను కాదని చెప్పారు. 

More Telugu News