KCR: విద్యార్థుల ఆత్మహత్యలపై.. కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ ఘాటు లేఖ

  • ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారు?
  • ఇంటర్ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలి
  • మొదట విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయండి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా లేఖ రాశారు. మార్కుల్లో గందరగోళానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బాధ్యుడని, వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలని లేఖలో కోరారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

"ప్రజల సమస్యలను మీరెప్పుడు పట్టించుకున్నారు గనుక! ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డును మీరెందుకు ప్రక్షాళన చేయడంలేదు? అవినీతి ఎక్కడున్నా ప్రక్షాళన చేస్తానని చెబుతుంటారు, మరి ఇంటర్ బోర్డు విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో చెప్పాలి" అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో నిలదీశారు.

కేసీఆర్ తెలంగాణలో రాజకీయ అవినీతిని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో కూడిన సమస్యపై ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు.

More Telugu News