nani: నాని - ఇంద్రగంటి సినిమా టైటిల్ అది కాదట

  • ఇంద్రగంటితో మరోసారి నాని
  •  వెరైటీ టైటిల్ ఖరారు 
  • త్వరలోనే సెట్స్ పైకి    

నాని ఇప్పుడు ఫుల్ ఖుషీగా వున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో ఆయన 'జెర్సీ' పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది .. ఆశించిన విజయాన్ని దోసిట్లో పెట్టింది. ఈ జోష్ తో నాని తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు. ఆయన తదుపరి సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణతో వున్న విషయం తెలిసిందే.

 ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా వున్నాడు. ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. కానీ అసలు ఆ టైటిల్ ను తాము అనుకోనేలేదని ఈ సినిమా టీమ్ చెబుతోంది. కథా పరంగా ఈ సినిమాకి ఒక వెరైటీ టైటిల్ ను అనుకుంటున్నారనీ, ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసిన తరువాత, టైటిల్ లోగోతో కూడిన ఫస్టు లుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News