abid ali: నా పట్ల సచిన్ సానుకూలంగా స్పందిస్తారనే అనుకుంటున్నా: పాక్ బ్యాట్స్ మెన్ అబిద్ అలీ

  • సచిన్ ను కలవాలనేది నా చిరకాల స్వప్నం
  • తొలి రోజు నుంచి సచిన్ టెక్నిక్ ఫాలో అవుతున్నా
  • సచిన్ లా ఆడేందుకు ప్రయత్నించా

పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ అబిద్ అలీ తన కెరీర్లో తొలిసారి ప్రపంచకప్ ఆడబోతున్నాడు. పాక్ డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించిన అబిద్... ఇటీవలే జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. తన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించి అందరి అంచనాలు పెంచేశాడు. 31 ఏళ్ల అబిద్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని. సచిన్ ను కలసి బ్యాటింగ్ మెళకువలను తెలుసుకుంటానని ఆయన తెలిపాడు.

'సచిన్ ను కలవాలనేది నా చిరకాల స్వప్నం. సచిన్ నుంచి ఎలాంటి మెళకువలైనా నేను నేర్చుకోవాలనుకుంటే... ఆయన సానుకూలంగా స్పందిస్తారనే అనుకుంటున్నా. సచిన్ ను కలసిన రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. నా కెరీర్ తొలి రోజు నుంచి సచిన్ టెక్నిక్ లను ఫాలో అవుతున్నా. సచిన్ ఆట తీరును పరిశీలించిన తర్వాత అతనిలా ఆడేందుకు ప్రయత్నించా. ఇంజమామ్ ఉల్ హక్, మొహమ్మద్ యూసుల్ మాదిరి సచిన్ గొప్ప ఆటగాడు. సచిన్ సాధించిన రికార్డులు చాలా గొప్పవి.

వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ ను కూడా కలుస్తా. గ్రేట్ ప్లేయర్లందరినీ కలిసి, వారి నుంచి నేర్చుకుంటా. పాకిస్థాన్ తరఫున ఆడేందుకు అవకాశం వచ్చే ప్రతిసారి గొప్పగా ఆడేందుకు ప్రయత్నిస్తా. నా పేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు యత్నిస్తా' అని అబిద్ అలి చెప్పాడు.

More Telugu News