lawrence: తెలుగు రాష్ట్రాల్లో 'కాంచన 3' మూడు రోజుల వసూళ్లు

  • లారెన్స్ ప్రధాన పాత్రధారిగా 'కాంచన 3'
  • హారర్ తో పాటు కామెడీకి ప్రాధాన్యత 
  • మాస్ ఏరియాల్లో మరిన్ని వసూళ్లు    

లారెన్స్ కథానాయకుడిగా ఆయన స్వీయ దర్శకత్వంలో 'కాంచన 3' చిత్రం నిర్మితమైంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లారెన్స్ సరసన వేదిక .. ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ సినిమా 9.13 కోట్ల షేర్ ను సాధించింది.

హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో లారెన్స్ నటన హైలైట్ అని చెబుతున్నారు. హారర్ తో పాటు కామెడీకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం వలన, ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సాధారణంగా లారెన్స్ సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలా 'కాంచన 3'లోని మాస్ అంశాలు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయని అంటున్నారు. వేసవి సెలవుల కారణంగా ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. 

More Telugu News