Sri Lanka: కొలంబో విమానాశ్రయంలో పేలని బాంబు గుర్తింపు

  • నిర్వీర్యం చేసిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్
  • ప్రధాన టెర్మినల్ కు వెళ్లే మార్గంలో అమర్చిన ఉగ్రవాదులు
  • దేశీయంగా తయారుచేసిన పైప్ బాంబుగా గుర్తింపు

శ్రీలంక మారణహోమం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈస్టర్ సందర్భంగా కొలంబోలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 295 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, కొలంబో విమానాశ్రయం వద్ద పోలీసులు పేలని ఓ బాంబును గుర్తించారు. ఉగ్రవాదులు మెయిన్ టెర్మినల్ కు వెళ్లే మార్గంలో దీన్ని అమర్చారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ దీన్ని నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది స్థానికంగా రూపొందించిన పైప్ బాంబు అని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ దాడులతో సంబంధం ఉందని భావిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఎనిమిది పేలుళ్లు చోటుచేసుకోగా, వాటిలో రెండు ఆత్మాహుతి దాడులు అని భావిస్తున్నారు. మిగతా ఆరు పేలుళ్లు ముందే అమర్చిన బాంబుల కారణంగా జరిగాయని పోలీసులు తెలిపారు.

More Telugu News