Andhra Pradesh: ఏపీలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం.. రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు వేధింపులు, అడ్డువచ్చిన టీసీపై దాడి!

  • చిత్తూరు జిల్లాలోని రేణిగుంట స్టేషన్ లో ఘటన
  • వేధింపులను అడ్డుకున్న టీసీ ఉమామహేశ్వరరావు
  • బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులపై ఈ ముఠా సభ్యులు బ్లేడ్లతో ప్రయాణికులపై దాడికి ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న టీసీ ఉమామహేశ్వరరావు వీరిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ప్రయాణికులను వదిలేసి టీసీపైనే ఈ బ్లేడ్ బ్యాచ్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడ్డ ఉమామహేశ్వరరావును అధికారులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘర్షణను గుర్తించిన రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బ్లేడ్ బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తమిళనాడుకు చెందిన విజయన్, వెంకటేశ్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరిద్దరిపై కేసు నమోదుచేసిన పోలీసులు మరికాసేపట్లో కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. వీరికి గతంలో ఇలాంటి నేరచరిత్ర ఉందా? వీరు డ్రగ్స్ మత్తులో ఈ దాడికి తెగబడ్డారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

More Telugu News