nani: 'జెర్సీ' కథను నాకంటే ఎక్కువగా నాని నమ్మాడు: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

  • నానీకి కథ చెప్పగానే ఓకే అన్నాడు 
  • ఆయన కాన్ఫిడెంట్ చూసి భయపడ్డాను 
  • విడుదలకి ముందురోజు టెన్షన్ పడ్డాను  

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా రూపొందిన 'జెర్సీ' నిన్ననే థియేటర్లకు వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నాని క్రికెటర్ గా కనిపించాడు. తొలి రోజునే ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చేసింది. నానీకి .. దర్శక నిర్మాతలకి అభినందనలు తెలిపే ప్రముఖుల సంఖ్య పెరుగుతూపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ .. " ఈ కథను నానికి వినిపించగానే చేసేద్దాం అన్నాడు. ఆయన కాన్ఫిడెంట్ చూసి నాకు భయం వేసింది. నాకంటే ఈ కథను ఆయన ఎక్కువగా నమ్మాడు. 'అర్జున్' పాత్రను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక విడుదలకి ముందురోజున నాకు నిద్రకూడా పట్టలేదు. ఇంతమంది నాపై పెట్టుకున్న నమ్మకం నిలబడుతుందా? అని టెన్షన్ పడ్డాను. తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మనసు కాస్త కుదుటపడింది. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు వున్నాయి. కొంత సమయం తీసుకుని, మళ్లీ రంగంలోకి దిగుతాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News