మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్న చైతూ, సమంత!

20-04-2019 Sat 16:58
  • సక్సెస్ టాక్‌ను సంపాదించుకున్న ‘మజిలీ’
  • ఆనందంలో చై, సామ్ జంట
  • కథను వినిపించిన అజయ్ భూపతి
శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను సంపాదించుకోవడంతో చైతూ, సమంత జంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇప్పుడు అదే జోష్‌తో ఈ జంట మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి చై, సామ్‌లకు ఓ కథను వినిపించారని, దీనికి వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.