kurnool: కర్నూలోలో పేలిన గ్యాస్ ఆటో.. ఒకరు మృతి

  • కర్నూలు నుంచి కల్లూరుకు వెళుతున్న ఆటో 
  • ఎండ వేడిమికి పేలిపోయిన సీఎన్జీ సిలిండర్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక వ్యక్తి

కర్నూలులో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున ఒక గ్యాస్ ఆటో పేలిపోయింది. ఎండ వేడిమికి ఆటోలోని సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఈ దారుణం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తికి కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇతని పరిస్థితి విషమంగానే ఉంది. కర్నూలు నుంచి కల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

More Telugu News