mano: 'నువ్వు గాయకుడివి కాకుండా అడ్డుకున్నానురా' అంటూ చక్రవర్తిగారు బాధపడ్డారు: సింగర్ మనో

  • చక్రవర్తిగారు నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు
  • అక్కడ అన్నిపనులు నేనే చూసుకునేవాడిని
  • ఒకసారి ఆయన నా దగ్గర బాధపడ్డారు  

తాజా ఇంటర్వ్యూలో గాయకుడు 'మనో' మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "సంగీత దర్శకుడు చక్రవర్తిగారి సహాయకుల్లో ఒకరిగా చేరిన తరువాత ఆయన నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ట్యూన్స్ రాసుకోవడం .. హార్మోనియం వాయించడం .. ట్రాక్ పాడటం .. ఇలా అన్ని పనులను చేసేవాడిని. 'కర్పూర దీపం' సినిమా కోసం చక్రవర్తిగారు నాతో ఒక పాట పాడించారు.

ఆ తరువాత కొంతకాలానికి ఆయన మనసు విప్పి మాట్లాడారు .. బాధపడ్డారు. 'నువ్వు గాయకుడివి కాకుండా నేను కూడా అడ్డుకున్నానురా .. నా దగ్గర ఉండకుండా వెళ్లిపోతావేమోనని అలా చేశాను .. త్రీ ఇన్ వన్ టేప్ రికార్డర్ లాంటివాడివి నువ్వు .. నిన్ను వదులుకోవడం ఇష్టంలేక అలా చేశాను" అన్నారు. సింగర్ గానే ప్రయాణం సాగిద్దామని చక్రవర్తిగారి దగ్గర నుంచి వచ్చేశాను. కానీ గాయకుడిగా నిలదొక్కుకుంటానా? లేదా? వెనక్కి వచ్చేస్తే చక్రవర్తిగారు మళ్లీ పని ఇస్తారో లేదో అనే భయం మాత్రం ఉంటూ వుండేది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News