hardik pandya: మహిళలపై కామెంట్లకు.. పాండ్యా, కేఎల్ రాహుల్ లకు చెరో రూ. 20 లక్షల జరిమానా!

  • కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
  • జరిమానా విధించిన అంబుడ్స్ మన్ డీకే జైన్
  • నాలుగు వారాల్లోగా చెల్లించాలంటూ ఆదేశం

టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లకు బీసీసీఐ అంబుడ్స్ మన్ డీకే జైన్ చెరో రూ. 20 లక్షల జరిమానా విధించారు. పాప్యులర్ టీవీ షో 'కాఫీ విత్ కరణ్'లో వీరిద్దరూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తీవ్ర విమర్శలను ఎదుర్కోవడమే కాక, కొన్ని రోజుల పాటు బీసీసీఐ బహిష్కరణకు కూడా గురయ్యారు.

పాండ్యా, రాహుల్ లకు జరిమానా విధించిన ఆర్డరును బీసీసీఐ తన అధికార వెబ్ సైట్ లో ఉంచింది. ఈ ఆర్డర్ లో వీరిద్దరిపై తదుపరి చర్యలు ఏమీ ఉండబోవని డీకే జైన్ తెలిపారు. రూ. 20 లక్షల జరిమానాలో ఒక లక్షను పారామిలిటరీ బలగాల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల భార్యల సంక్షేమం కోసం ఇవ్వాలని... 'భారత్ కే వీర్ యాప్' ద్వారా అందించాలని ఆదేశించారు. రూ. 10 లక్షలను అంధుల క్రికెట్ అసోసియేషన్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని చెప్పారు. నాలుగు వారాల్లోగా ఈ చెల్లింపులన్నీ చేయాలని ఆదేశించారు. పాండ్యా, రాహుల్ ల వివాదాన్ని విచారించడానికి డీకే జైన్ ను సుప్రీంకోర్టు అంబుడ్స్ మన్ గా నియమించింది.

More Telugu News