ఆసక్తిని రేపుతోన్న 'బ్రోచేవారెవరురా' టీజర్

20-04-2019 Sat 13:05
  • కామెడీ ప్రధానంగా సాగే 'బ్రోచేవారెవరురా'
  • అయిదు ప్రధాన పాత్రల చుట్టూ అల్లిన కథ
  •  జూన్ లో ప్రేక్షకుల ముందుకు    
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'బ్రోచేవారెవరురా' సినిమా రూపొందుతోంది. నివేదా థామస్ .. శ్రీవిష్ణు .. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాకీ .. రాంబో .. రాహుల్ పాత్రల్లో శ్రీవిష్ణు .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణలను పరిచయం చేశారు. డబ్బుకోసం కిడ్నాపులు చేయడానికి రంగంలోకి దిగిన టీమ్ లా వీళ్లు కనిపిస్తున్నారు. భరతనాట్యంలో మంచి ప్రవేశమున్న 'మిత్ర' పాత్రలో నివేదా కనిపిస్తోంది. ఇక సినిమా దర్శకుడి పాత్రలో సత్యదేవ్ ను పరిచయం చేశారు. పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను రూపొందించారనే విషయం టీజర్ ను బట్టి తెలిసిపోతోంది. జూన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'సరిగమ సినిమాస్' వారు ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.