Andhra Pradesh: చంద్రబాబు అలుపెరగని శ్రామికుడు, అపర చాణక్యుడు!: పరుచూరి గోపాలకృష్ణ

  • చంద్రబాబు నిండునూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలి
  • ఆయన అమరావతి రాజధాని నిర్మాణ చతురుడు
  • ట్విట్టర్ లో స్పందించిన సినీ రచయిత, నటుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండునూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈరోజు ట్విట్టర్ లో పరుచూరి స్పందిస్తూ.. ‘అలుపెరుగని శ్రామికుడు , అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు , గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు ???శతమానం భవతు ??? @ncbn  #Happy Birthday CBN’ అని ట్వీట్ చేశారు.

More Telugu News