BCCI: క్రికెటర్ల భార్య అయినా, ప్రియురాలు అయినా... 20 రోజుల తరువాతే కలిసే చాన్స్: బీసీసీఐ కొత్త రూల్

  • మే 31 నుంచి వరల్డ్ కప్ క్రికెట్
  • 20 రోజుల తరువాత వెంట భాగస్వామి
  • గత నిబంధనను సవరించిన బీసీసీఐ

దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతూ, ప్రపంచ క్రికెట్ ప్రియులను అలరించేందుకు వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త నిబంధన విధించింది. క్రికెటర్లు తమ భార్యలనైనా, ప్రియురాళ్లను అయినా, టోర్నీ ప్రారంభమైన 20 రోజుల తరువాతే కలవడానికి అనుమతిస్తామని తేల్చి చెప్పింది.

ఫైనల్ వరకూ భారత్ చేరితే మొత్తం 35 రోజులకు పైగా లండన్ లో జట్టు ఉంటుంది. అంటే, ఆటగాళ్ల భాగస్వాములు వారితో 15 రోజుల పాటు మాత్రమే కలిసుండే వీలుంటుంది. గతంలో వరల్డ్ కప్ పోటీల్లో రెండు వారాల తరువాత కుటుంబీకులను అనుమతించేవారు. ఇప్పుడు దాన్ని మరో ఐదు రోజులు పెంచారు. మే 22న భారత జట్టు ఇంగ్లండ్ కు ప్రయాణించనుండగా, 31 నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది. ఈ 20 రోజులు గడిచేవరకు టోర్నీలో లీగ్ మ్యాచ్ లన్నీ పూర్తవుతాయి. భారత జట్టు నాకౌట్ దశకు వెళుతుందో లేదో కూడా స్పష్టమైపోతుంది.

More Telugu News