vishal: ఆసక్తిని రేపుతోన్న 'అయోగ్య' ట్రైలర్

  • విశాల్ కథానాయకుడిగా 'అయోగ్య'
  • కీలకమైన పాత్రలో పార్తీబన్ 
  • వచ్చేనెలలో విడుదల  

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన 'టెంపర్' మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో రీమేక్ అయింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరో పాత్రలోని వేరియేషన్స్ ను ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించారు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పార్తీబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలోనూ ఈ సినిమా భారీ హిట్ కొడుతుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందేమో చూడాలి.

More Telugu News