Jeevitha: ఎక్కడ ఏది జరిగినా దాన్ని సినిమా పరిశ్రమకు ఆపాదించడం సరికాదు: జీవిత

  • సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ వ్యవహారంలో జీవిత స్పందన
  • బాధితురాలిని అన్ని విషయాలు అడిగాను
  • ఏ ఘటన జరిగినా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడొద్దు

హైదరాబాద్ లోని సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకుడు వినయ్ వర్మ తనను బట్టలు విప్పాలంటూ ఒత్తిడి చేశారని ఓ యువతి చేసిన ఆరోపణలు చిత్రసీమలో తీవ్ర కలకలం రేపాయి. నటనలో భాగమే ఇదంతా, బట్టలు విప్పాల్సిందే అంటూ వినయ్ వర్మ ఒత్తిడి చేశారని, బట్టలు విప్పకుంటే వెళ్లిపొమ్మన్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనిపై పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో 'మా' ప్రధాన కార్యదర్శి జీవిత స్పందించారు.

"సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకుడు తన పట్ల బ్లాక్ మెయిల్ కు పాల్పడిన తీరులో బెదిరించారని బాధితురాలు చెబుతోంది. ఆమెను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. యాక్టింగ్ స్కూల్ లో చేరిన రోజున నిండుగా బట్టలు వేసుకుని రావాలని చెప్పారని, ఇప్పుడేమో బట్టలు విప్పకుంటే వెళ్లిపో అన్నారని ఆ అమ్మాయి వాపోయింది. అయితే, తనను కొట్టడం కానీ, ఇతరత్రా ఏమైనా వేధించారా? అంటే "లేదు" అని చెప్పింది.

అయినా, ఇండస్ట్రీలో అమ్మాయిలకు భద్రత ఉండాలన్న విషయం నేను అంగీకరిస్తాను. నాకూ ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, ఎక్కడ ఏది జరిగినా దాన్ని సినిమా పరిశ్రమకు ఆపాదించడం సరికాదు. బట్టలు విప్పితేనే ఇండస్ట్రీలో కెరీర్ ముందుకు సాగుతుందని అనే ధోరణిలో మాట్లాడడం సరికాదు" అంటూ స్పష్టం చేశారు. 

More Telugu News