chandrababu: జూన్ 6 వరకు చంద్రబాబే సీఎం: రాజేంద్రప్రసాద్

  • చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తే తప్పెలా అవుతుంది?
  • ప్రజా సంక్షేమాన్ని సీఎం చూడకూడదని చెప్పేందుకు ఈసీ ఎవరు?
  • జగన్ కేసులో ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్ గా ఎలా నియమిస్తారు?

ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపితే తప్పెలా అవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని... పూర్తి స్థాయి సీఎం అని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం ఐదేళ్లు ఉంటుందని అన్నారు. 2014 జూన్ 7న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని... 2019 జూన్ 6 వరకు సీఎంగా ఆయనే ఉంటారని చెప్పారు. పోలింగ్ పూర్తైన తర్వాత కూడా ప్రజా సంక్షేమాన్ని సీఎం చూడకూడదని చెప్పేందుకు ఎన్నికల సంఘం ఎవరని ప్రశ్నించారు. జగన్ కేసులో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని అన్నారు.

More Telugu News