India: నేను శపించాను.. 3 నెలలకే ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే చనిపోయాడు!: బీజేపీ నేత ప్రజ్ఞా సాధ్వీ

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత
  • మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదల
  • తనను అన్యాయంగా కేసులో ఇరికించబోయారని ఆరోపణ

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన బీజేపీ నేత ప్రజ్ఞా సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర  ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్(ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే తనను అన్యాయంగా ఓ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. దీంతో ‘నీ వంశం నాశనమైపోతుందని నేను శపించాను’ అని గుర్తుచేసుకున్నారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బీజేపీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రజ్ఞ మాట్లాడారు. తాను శపించిన 3 నెలలకే హేమంత్ కర్కరే ముంబైపై పాక్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వ్యాఖ్యానించారు. కాగా, ప్రజ్ఞా సాధ్వీ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

దీంతో ఉగ్రదాడికి సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రతిపక్షాలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదే పని తాము చేసి ఉంటే ఏమయ్యేదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రశ్నించారు. 

More Telugu News