East Godavari District: కాలువలో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల అంశంపై ఈసీ సీరియస్‌...పీఓ, ఏపీఓలపై క్రిమినల్‌ కేసుల నమోదు

  • ఇద్దరినీ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం
  • మొదటి విడత పోలింగ్‌ తర్వాత బయటపడిన స్లిప్పులు
  • వివాదం కావడంతో విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారులు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తొలివిడత ఎన్నికల పోలింగ్‌ తర్వాత కాలువలో దర్శనమిచ్చిన వీవీ ప్యాట్‌ స్లిప్పుల అంశంపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. సంబంధిత పోలింగ్‌ కేంద్రం పోలింగ్‌ ఆఫీసర్‌ గంటా లత, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌ ముచ్చుకరెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇద్దరినీ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే...మండపేట మండలం మారేడుబాక సమీపంలోని శ్రీసూర్యచంద్ర ఫ్యాక్టరీ సమీపంలోని ఓ కాలువలో గుట్టగా పడివున్న వీవీ ప్యాట్‌ స్లిప్పులను స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. విషయం మీడియా ప్రతినిధులకు కూడా తెలియడంతో ఈ అంశం వివాదమైంది. ఈ స్లిప్పులు మాక్‌ పోలింగ్‌వా, అసలైన పోలింగ్‌వా అన్న అంశంపై అధికారులు నోరు విప్పక పోవడంతో మరింత వివాదం నెలకొంది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజా నిర్ణయం తీసుకుంది.

More Telugu News