Sam Pitroda: ఈవీఎంలలో ఏదో ఉంది... నేను కనిపెడతా: శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు

  • ఓ ఈవీఎం ఇచ్చి ఏడాది సమయం ఇవ్వండి
  • అధ్యయనం చేసి లోపం కనిపెడతా
  • రాజీవ్ గాంధీ సలహాదారు శామ్ పిట్రోడా

భారత ఎన్నికలలో వినియోగిస్తున్న ఈవీఎంలలో తేడా ఉందన్న అనుమానం తనకు ఉందని, అదేంటన్నది వెంటనే చెప్పలేనని, ఓ ఏడాది సమయం ఇచ్చి, ఓ ఈవీఎంను తనకిస్తే, అధ్యయనం చేసి చెబుతానని కాంగ్రెస్ నేత, టెక్నికల్ ఎక్స్ పర్ట్ శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంజనీర్ అయిన తనకు ఈవీఎంలపై తృప్తి లేదని అన్నారు. అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, దీనిపై అధ్యయనం చేయాలంటే, తన వద్ద ఈవీఎం లేదని అన్నారు. దాని డిజైన్, సాఫ్ట్ వేర్ ను అర్థం చేసుకుంటే లోపం గురించి చెప్పవచ్చని అన్నారు. కాగా, శామ్ పిట్రోడా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సాంకేతిక సలహాదారుగా పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఈవీఎంలను తాము నమ్మడం లేదని, కనీసం 50 శాతం వీవీప్యాట్ లను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News