New Delhi: ‘హిందూ టెర్రర్’ అంశంపై మాట్లాడుతుండగా నాపై దాడికి యత్నం: జీవీఎల్

  • భోపాల్ లో మా అభ్యర్థిపై దిగ్విజయ్ పోటీ చేస్తున్నారు
  • ‘హిందూ టెర్రర్’ పేరిట అవమానపరిచేలా మాటలు 
  • దీని వెనుక ఎవరి హస్తం ఉందో విచారణలో తేలుతుంది

ఢిల్లీలో మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతుండగా కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవ అనే వైద్యుడు చెప్పు విసరడం తెలిసిందే. ఈ సంఘటనపై జీవీఎల్ స్పందిస్తూ, విలేకరుల సమావేశంలో తనతో పాటు బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకులు కూడా కూర్చుని ఉన్నారని, అయినా తనపైనే దాడి ఎందుకు చేశారంటే.. ‘హిందూ టెర్రర్’ అన్న అంశంపై తాను మాట్లాడానని అన్నారు.

భోపాల్ లో తమ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారని, భారత సంస్కృతిని, హిందూ జాతిని ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని, ‘హిందూ టెర్రర్’ పేరుతో మన దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తాను చెబుతున్న సమయంలో తనపై దాడికి విఫలయత్నం జరిగిందని అన్నారు. ‘హిందూ టెర్రర్’ పేరిట ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి దోషిగా ఎవరైతే నిలబడ్డారో, వారి హస్తం దీని వెనుక ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.  

More Telugu News