Telangana: తెలంగాణ ఇంటర్ మీడియట్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల విడుదల
  • మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ 
  • ఈ నెల 25 ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8 శాతం విద్యార్థులు, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రేపు విడుదల కానుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీగా అధికారులు నిర్ణయించారు.

More Telugu News