vaishnav tej: వైష్ణవ్ తేజ్ జోడీగా మలయాళ బ్యూటీ

  • వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రం
  • కొన్ని రోజుల క్రితమే సెట్స్ పైకి
  •  కథానాయికగా దేవిక సంజయ్ పరిచయం

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా తెలుగులో ఒక సినిమా రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు 'బుచ్చిబాబు' దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో కథానాయకుడు జాలరి కుటుంబానికి చెందిన వ్యక్తిలా కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.

చివరికి మలయాళ బ్యూటీ 'దేవిక సంజయ్' ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్రితం ఏడాదే ఈ అమ్మాయి మలయాళ చిత్రపరిశ్రమకి పరిచయమైంది. వైష్ణవ్ తేజ్ సినిమా ద్వారానే తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇప్పటికే మలయాళ ముద్దుగుమ్మలు తెలుగు తెరను ఏలేస్తున్నారు. వాళ్ల జాబితాలోకి ఈ అమ్మాయి కూడా చేరిపోతుందేమో చూడాలి. 

More Telugu News