Tollywood: టాలీవుడ్ లో లైంగిక వేధింపులు.. విచారణ కమిటీని ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం!

  • ముగ్గురు సభ్యులతో ఏర్పాటు
  • సినీ ప్రతినిధులుగా ఝాన్సీ, నందినీరెడ్డి, సుప్రియ
  • జీవో జారీచేసిన కేసీఆర్ సర్కారు

తెలుగు సినీపరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు కమిటీ ఏర్పాటు అయింది. ఇటీవల పలువురు మహిళా ఆర్టిస్టులు చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన డా.రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో ఈ కమిటీ ఏర్పాటు అయింది.

అలాగే ఇందులో సినీనటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినీరెడ్డిలను ప్రభుత్వం టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. టాలీవుడ్ లో మహిళలను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా కమిటీకి ఫిర్యాదు చేయాలనీ, నిందితులపై విచారణ జరిపి దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

More Telugu News