nani: నాని సినిమా కోసం రంగంలోకి బాలీవుడ్ సంగీత దర్శకుడు

  • అమిత్ త్రివేదికి పెరుగుతోన్న అవకాశాలు
  • తెలుగు నుంచి వెళుతోన్న ప్రాజెక్టులు
  •  అమిత్ త్రివేది డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్  

బాలీవుడ్ సంగీత దర్శకులలో అమిత్ త్రివేది పేరు ఎక్కువగా వినిపిస్తోంది. భారీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఆయనని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక తెలుగు నుంచి కూడా వరుస సినిమాలు ఆయనకి వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన చిరంజీవి 'సైరా'తో పాటు .. ప్రభాస్ 20వ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆయనకి మరో అవకాశం లభించింది. నాని - సుధీర్ బాబు కలిసి నటించే సినిమాకి సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని ఎంపిక చేసుకున్నారు. నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో అదితీరావ్ హైదరీ .. నివేదా థామస్ కథానాయికలుగా నటించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాల తరువాత అమిత్ త్రివేదికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News