Christ: ఏసు క్రీస్తు ముళ్ల కిరీటం భద్రంగానే ఉంది... స్పష్టం చేసిన ఫ్రాన్స్!

  • సోమవారం రాత్రి పురాతన చర్చ్ లో అగ్నిప్రమాదం
  • విలువైన వస్తువులన్నీ భద్రమేనన్న అధికారులు
  • చర్చ్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పట్టవచ్చంటున్న నిపుణులు

సోమవారం రాత్రి వ్యాపించిన దావానలం, 8 శతాబ్దాల చరిత్రగల నోట్రాడామ్ కేథడ్రల్ చర్చ్ ని కుప్పకూల్చగా, ఇందులో భద్రపరిచిన జీసస్ తలకు తొడిగిన ముళ్ల కిరీటం, మరికొన్ని విలువైన వస్తువులు, పవిత్ర చిహ్నాలను కాపాడామని, వాటిని పారిస్ టౌన్ హాల్ లో భద్రపరిచామని ఫ్రాన్స్ ప్రకటించింది. చర్చ్ గోపురం కలపతో తయారు చేసినది కావడంతోనే, మంటలు వేగంగా వ్యాపించాయని, దాదాపు 400 మంది ఫైర్ ఫైటర్స్ 15 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారని అన్నారు.

కాగా, ఈ మంటల ధాటికి గోపురంలో మూడింట రెండు వంతుల భాగం కూలిపోగా, పాత కట్టడాన్ని పోలిన కట్టడాన్నే నిర్మించాలంటే కనీసం 20 సంవత్సరాలు శ్రమించాలని దిగ్గజ నిర్మాణ కంపెనీలు ప్రకటించడం గమనార్హం. నాట్రడామ్ కేథడ్రల్ చర్చ్ పునర్నిర్మాణానికి సహకరించేందుకు జర్మనీ, ఇటలీ అంగీకరించాయి.

More Telugu News