Tamil Nadu: తమిళనాట జయలలిత-కరుణానిధి లేని తొలి ఎన్నికలు ఇవే!

  • జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అన్నాడీఎంకే, డీఎంకే
  • అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కమల్ హాసన్

దేశవ్యాప్తంగా నేడు 95 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో జరుగుతున్న ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. దిగ్గజ నేతలైన జయలలిత, కరుణానిధి వంటి వారు లేకుండానే ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాదు, ఇలా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

రెండో విడత ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలు చెరో 20 స్థానాల్లో బరిలో ఉన్నాయి. మిత్రపక్షాలు కొన్ని సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డీఎంకే.. కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అన్నాడీఎంకే.. బీజేపీ, విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీఎంకేలతోపాటు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇక, ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన శశికళ అక్క కొడుకు  టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే), సినీ నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీతి మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) కూడా బరిలో ఉన్నాయి.

More Telugu News