samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మారిషస్ లో సమంత పాట  
  • 'మహర్షి' షూటింగ్ పూర్తి 
  • తాజా షెడ్యూల్ లో 'వాల్మీకి'

*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని శర్వానంద్, సమంత జంటగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను నిన్నటి నుంచి మారిషస్ లో హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'జాను' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. మే 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
*  వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారిగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న 'వాల్మీకి' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసరాల్లో 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ ను నిర్వహిస్తారు.

More Telugu News