Guntur District: కోడెల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారొద్దు: అంబటి రాంబాబు

  • ఇనిమెట్లలో దౌర్జన్యం చేసేందుకే కోడెల వెళ్లారు
  • ఇనిమెట్లలో ఏ రోజూ గొడవలు జరగలేదు
  • అలాంటి గ్రామంలో చిచ్చుపెట్టేందుకే కోడెల వెళ్లారు

పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో దౌర్జన్యం చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అక్కడికి వెళ్లారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇనిమెట్ల గ్రామ చరిత్రను తిరగేస్తే, ఆ గ్రామంలో ఏ రోజునా తగాదా లేదు, ఫ్యాక్షన్ గొడవలు, ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడిన సంఘటనలు లేవని అన్నారు. అలాంటి ఇనిమెట్ల గ్రామంలో చిచ్చుపెట్టేందుకే కోడెల వెళ్లారని, ప్రజలు తిరగబడటంతో దానికి బెంబేలెత్తిపోయారని విమర్శించారు.

చట్టం చట్ట ప్రకారం పని చేయాలని, సూచించిన అంబటి, పోలీస్ శాఖకు ఓ హెచ్చరిక చేశారు. కోడెల శివప్రసాద్ హయాంలో ఏవో పోస్టింగ్స్ వచ్చాయని చెప్పి, ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తే కనుక వాళ్లకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనలో కోడెల శివప్రసాద్ పై కేసు నమోదు చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని తాను చెప్పిన తర్వాతే ఆయనపై కేసు నమోదు చేశారని విమర్శించారు. కోడెల చేతిలో కీలుబొమ్మలుగా మారొద్దని పోలీసులకు అంబటి  సూచించారు. 

More Telugu News