karthikeya: కార్తికేయ హీరోగా 'హిప్పీ' .. విడుదల తేదీ ఖరారు

  • కార్తికేయ హీరోగా 'హిప్పీ'
  • నాయికగా 'దిగాంగన' పరిచయం
  •  జూన్ 7వ తేదీన థియేటర్లకు

కార్తికేయ పేరు వినగానే 'ఆర్ ఎక్స్ 100' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ ను తనదైన శైలిలో పండించిన తీరు కళ్లముందు కదలాడుతుంది. ఆయన తాజా చిత్రంగా 'హిప్పీ' నిర్మితమైంది. కలైపులి థాను నిర్మించిన ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూన్ 7వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కార్తికేయ జోడీగా దిగాంగన నటించింది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక జేడీ చక్రవర్తి .. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. డిఫరెంట్ లుక్ తో కార్తికేయ చేసిన ఈ సినిమా, ఆయన ఖాతాలోకి మరో విజయాన్ని చేరుస్తుందేమో చూడాలి.

More Telugu News