evm: ఈవీఎంలో ఆ బటన్ నొక్కితే షాక్ కొడుతుందన్న కాంగ్రెస్ నేత.. నోటీసులు జారీచేసిన ఈసీ

  • ఛత్తీస్ గఢ్ మంత్రి లక్మాకు కష్టాలు
  • ప్రజలను తప్పుదారి పట్టించినందుకు నోటీసులు
  • 3 రోజుల్లోగా జవాబు ఇవ్వాలని ఆదేశం

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత కవసి లక్మా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీచేసింది. ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్మా ప్రజలను ఉద్దేశించి ‘మీరంతా ఈవీఎంలో ఒకటో బటన్ నొక్కండి.. రెండో బటన్ నొక్కితే షాక్ తగులుతుంది’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని అభిప్రాయపడ్డ ఈసీ, లక్మాకు నోటీసులు జారీచేసింది. మూడు రోజుల్లోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఛత్తీస్ గఢ్ లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరించినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది.

More Telugu News