Tamilanadu: తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గ ఎన్నిక వాయిదా

  • భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు
  • ఎన్నిక వాయిదాకు రాష్ట్రపతికి ఈసీ సిఫారసు
  • రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వాయిదా పడ్డ ఎన్నిక

ఈ నెల 18న తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నిక వాయిదా పడింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

కాగా, ఈ నియోజకవర్గంలో ఇటీవల భారీ నగదును సీజ్ చేశారు. వెల్లూరు డీఎంకే అభ్యర్థి కదిరి ఆనంద్ కు చెందిన గోదాంలో 11.53 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పోలింగ్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిన్న రాత్రి ఈసీ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు, రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఎన్నిక రద్దు అయింది.

More Telugu News