chidambaram: చిదంబరం భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు

  • నల్లధనంపై పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు
  • మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
  • విదేశాల్లో అక్రమాస్తులు, రహస్య బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు ఐటీ ఆరోపణ

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం భార్య నళిని, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఓ నల్లధనం కేసుకు సంబంధించి వీరిపై ఉన్న అభియోగాలను గత ఏడాది మద్రాసు హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐటీ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో వివరణ ఇవ్వాలంటూ నళిని, కార్తీలకు నోటీసులు జారీ చేసింది. చిదంబరం భార్య, కుమారుడు, కూమార్తెలకు విదేశాల్లో అక్రమాస్తులు, రహస్య బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు ఐటీ శాఖ ఆరోపిస్తోంది.

More Telugu News