tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ... నేడు వస్తే రేపే దర్శనం!

  • వెల్లడవుతున్న పరీక్షల ఫలితాలు
  • మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న విద్యార్థులు
  • సాధారణ దర్శనానికి 20 గంటలకు పైగా సమయం

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. పరీక్షల ఫలితాలు వెల్లడవుతుండటంతో మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ భక్తులతో నిండిపోగా, క్యూలైన్ కిలోమీటర్ మేరకు బయటకు విస్తరించింది.

ఈ క్రమంలో సాధారణ దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు 81,195 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, 34,630 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెలిపారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.38 కోట్లని తెలిపారు. దర్శనానికి వచ్చి క్యూలైన్లో వేచివున్న భక్తులకు అన్నపానీయాలను అందిస్తున్నామని అన్నారు.

More Telugu News