China: చైనా అమ్ములపొదిలో 'సముద్ర బల్లి'!

  • భూమిపైనా, నీటిలోనూ ప్రయాణించే సరికొత్త డ్రోన్ బోట్
  • ఏకంగా 1200 కిమీ ప్రయాణించే సమర్థత
  • రిమోట్ కంట్రోల్ తో నిర్వహణ

ఆసియాలో ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న చైనా అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం చేరింది. దాని పేరు ది 'మెరైన్ లిజార్డ్'. అంటే సముద్ర బల్లి అని అర్థం. ఇది నీటిలోనూ, భూమిపైనా ప్రయాణించే ఉభయచర డ్రోన్ బోట్. ఈ బోట్ ను నడిపేందుకు మనుషులు అవసరంలేదు. ఓ డ్రోన్ తరహాలో ఇది కూడా మానవరహిత వాహనం. ఇందులో శత్రువుల పనిబట్టడానికి యాంటీ షిప్ మిస్సైళ్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, రెండు మెషీన్ గన్లు, ప్రత్యర్థుల ఆచూకీ కనిపెట్టేందుకు ఎలక్ట్రో ఆప్టిక్ రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

 గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ ఉభయచర డ్రోన్ బోట్ ఏకధాటిగా 1200 కిలోమీటర్లు పయనించగలదు. ఈ బోట్ కు డీజిల్ తో నడిచే 50 కిలోవాట్ హైడ్రోజెట్ ఇంజిన్ అమర్చారు. దీన్ని భూమిపై నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ, అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ ద్వారా కానీ నియంత్రించవచ్చు.

ఇప్పటికిప్పుడు ఇలాంటి ఆయుధాల రూపకల్పన వెనుక చైనా దురుద్దేశం దాగి ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు సందేహిస్తున్నారు. తైవాన్ దురాక్రమణ కోసమే చైనా ఈ 'సముద్ర బల్లి'ని అభివృద్ధి చేసినట్టు భావిస్తున్నారు. వీటి ద్వారా కొంతదూరం నీటిలో ప్రయాణించి ఆపై ప్రత్యర్థి భూభాగంలోకి ఊహించని రీతిలో ప్రవేశించే వీలుంది.

More Telugu News