nani: నాని, సుధీర్ బాబుల హీరోయిన్స్ వీరే

  • ఇంద్రగంటితో నాని 3వ సినిమా
  •  జూలై 2వ వారం నుంచి షూటింగు
  •  డిసెంబర్లో  విడుదల చేసే ఆలోచన  

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించనుండగా, పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇంద్రగంటితో నానికి ఇది మూడవ సినిమా కాగా .. సుధీర్ బాబుకి రెండవ సినిమా. ఈ సినిమాలో నాని సరసన నాయికగా అదితీ రావ్ హైదరీని .. సుధీర్ బాబు జోడీగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జూలై 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. ఆయా పాత్రలను విలక్షణంగా తీర్చిదిద్దిన విధానం ఈ సినిమాకి ప్రధానబలంగా నిలుస్తాయని చెబుతున్నారు.

More Telugu News