jayaprada: ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే మౌనమా? జయప్రదపై ఆజంఖాన్ వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్ నిప్పులు!

  • జయప్రదపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సుష్మా స్వరాజ్
  • ములాయం సింగ్ యాదవ్ టార్గెట్ గా ట్విట్టర్ లో విమర్శలు
  • మౌనంగా ఉంటే పొరపాటు చేసినట్టేనని వ్యాఖ్య

ఉత్తరప్రదేశ్ లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోందని, ములాయం సింగ్ యాదవ్, భీష్ముడి మాదిరిగా మౌనంగా ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. జయప్రదపై ఆజంఖాన్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై స్పందించిన ఆమె, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"ములాయం సింగ్‌ యాదవ్ భాయ్‌... మీరు సమాజ్‌ వాదీ పార్టీకి పెద్ద దిక్కు. మీకు సమీపంలోనే ఉన్న రామ్ పూర్ లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పొరపాటు చేయవద్దు" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆజంఖాన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్‌ చేశారు.

జయప్రద అసలు స్వరూపాన్ని తెలుసుకునేందుకు రామ్ పూర్ ప్రజలకు 17 సంవత్సరాలు పట్టిందని, తాను మాత్రం 17 రోజుల్లోనే ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని గుర్తించానని ఆజంఖాన్ వ్యాఖ్యానించడంపై మహిళా కమిషన్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

More Telugu News