Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సోషల్ మీడియాలో కాజల్ రికార్డ్ 
  • ఆ రీమేక్ లో విజయ్ దేవరకొండ కాదట 
  • వినాయక్ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్

*  ఫాలోవర్లను సంపాదించుకోవడంలో ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ లో రికార్డు కొట్టిన అందాలతార కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్ స్టాగ్రాంలో కూడా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఆమె అకౌంట్ కి ఇప్పటికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఏర్పడ్డారు.
*  రణ్ వీర్ సింగ్ కథానాయకుడుగా హిందీలో వచ్చిన 'గల్లీ బాయ్' హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు, ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని, విజయ్ నటించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
*  ప్రముఖ దర్శకుడు వినాయక్ కెరీర్ పరంగా ఇటీవలి కాలంలో వెనుకపడ్డారు. ఈ క్రమంలో రవితేజతో ఓ చిత్రాన్ని చేయడానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఆయన వినిపించిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

More Telugu News