రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎమ్మెల్సీలు

14-04-2019 Sun 21:17
  • ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం
  • ప్రమాణ స్వీకారం చేయించనున్న నేతి విద్యాసాగర్
  • కార్యక్రమంలో మహమూద్ అలీ సహా పలువురు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, నర్సిరెడ్డి, జీవన్‌రెడ్డి, కూర రఘోత్తమరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మీర్జా రియాజ్ హసన్ నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి చేత మండలి ఇన్‌చార్జి చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.