Facebook: కొన్ని గంటలపాటు నిలిచిపోయిన సోషల్ మీడియా!

  • పనిచేయడం మానేసిన సోషల్ మీడియా
  • అమెరికా, మలేషియా, టర్కీలోనూ ఇదే పరిస్థితి
  • మొబైల్‌లో నిరాటంకంగా పని చేసిన ఫేస్‌బుక్

ప్రస్తుతం మనిషి జీవితం మొత్తం సోషల్ మీడియాతోనే ముడిపడిపోయింది. కళ్లు తెరిచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ వాడుతూనే ఉంటారు. అయితే అకస్మాత్తుగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్  సరిగా పనిచేయడం మానేశాయి. ఏది తెరచి చూసినా ఎప్పుడూ లేనంతగా సమస్యలు ఎదురవుతున్నాయి.

అమెరికా, మలేషియా, టర్కీలోనూ ఇదే పరిస్థితి. గత నెలలోనూ ఇదే పరిస్థితులు ఎదురయ్యాయి. మొబైల్‌లో మాత్రం ఫేస్‌బుక్ యాప్ నిరాటంకంగా పనిచేస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో సమస్యలు ఎదురైనప్పటికీ ప్రస్తుతం మళ్లీ మామూలుగానే పని చేస్తున్నాయి. ఉదయం 6:28 నుంచి సాయంత్రం 4:00 వరకు భారత్‌లో ఫేస్‌బుక్ డెస్క్‌టాప్ వెర్షన్ డౌన్ అయిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

More Telugu News