madras highcourt: రెండో వివాహంపై మొదటి భార్యే కాదు...ప్రజలు కూడా ఫిర్యాదు చేయొచ్చు: మద్రాస్‌ హైకోర్టు

  • సర్కారు సేవకుల విషయంపై కోర్టు సూచన
  • ఓ విద్యుత్‌ ఉద్యోగి కేసు విచారణ సందర్భంగా ఆదేశం
  • సంబంధిత శాఖలే చర్యలు తీసుకోవచ్చని సూచన

ప్రభుత్వ ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుంటే దానిపై మొదటి భార్య మాత్రమే అభ్యంతరం చెప్పక్కర్లేదని, సామాజిక బాధ్యతగా ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చునని మద్రాస్‌ హైకోర్టు తెలిపింది. ఇటువంటి తప్పు జరిగితే సంబంధిత శాఖాధిపతులే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించింది.ఓ విద్యుత్‌ ఉద్యోగి కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు విద్యుత్‌ బోర్డు ఉద్యోగి ఒకరు 2013లో చనిపోయారు. ఇతనికి ఇద్దరు భార్యలుండగా మొదటి భార్యకు పింఛన్‌ అందుతోంది. అందులో సగం తనకు ఇప్పించాలని రెండో భార్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుబ్రమణియన్‌ భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం నేరం, ఈ వ్యవహారంపై విద్యుత్‌ బోర్డు అప్పుడే చర్యలు చేపట్టాల్సి ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు. ఇటువంటి సందర్భాల్లో మొదటి భార్యే కాకుండా ప్రజలు కూడా అటువంటి వ్యక్తులపై ఫిర్యాదు చేయవచ్చునని సూచించింది.

More Telugu News