New Delhi: ఢిల్లీలో నేడు విపక్ష నేతల భేటీ.. జరుగుతున్న ఎన్నికల తీరుపై చర్చ

  • కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశం కానున్న నేతలు
  • హాజరుకానున్న ఏపీ, ఢిల్లీ  సీఎంలు, ఇతర నాయకులు
  • ఈసీ పనితీరుపై చర్చించే అవకాశం

పార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో సమావేశం కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. దేశ రాజధానిలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఈరోజు ఉదయం 11.30 గంటల తర్వాత భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశానికి ఏపీ, ఢిల్లీ సీఎంలు చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ నాయకులు అభిషేక్‌ మనుసింగ్వి, కపిల్‌సిబల్‌ తదితరులు హాజరు కానున్నారు.

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు, ఈసీ పనితీరు తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు, ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఏపీలో ఈవీఎంలు మొరాయించిన అంశంపై ఇప్పటికే చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News