RCB: డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తరువాత... ఎట్టకేలకు బోణీ కొట్టిన విరాట్ కోహ్లీ సేన!

  • 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన క్రిస్ గేల్
  • హాఫ్ సెంచరీలతో రాణించిన కోహ్లీ, డివిలియర్స్
  • పంజాబ్ పై విజయం సాధించిన బెంగళూరు జట్టు

వరుసగా ఆరు మ్యాచ్ ల ఓటమి తరువాత, ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమైన తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. కోహ్లీ చూపిన పట్టుదల, డివిలియర్స్ మెరుపులు ఆర్సీబీ బోణీ కొట్టేలా చేశాయి. అంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేయగా, మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఆర్సీబీ గెలిచింది. పంజాబ్ జట్టులో వీరోచితంగా ఆడిన క్రిస్ గేల్ 64 బంతుల్లోనే 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతను పడిన శ్రమ, తొలి విజయం కోసం కోహ్లీ సేన చేసిన పోరాటం ముందు తేలిపోయింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 53 బంతుల్లో 67, డివిలియర్స్ 38 బంతుల్లో 59 పరుగులు చేసి రాణించారు.

More Telugu News