Jet Airways: 'మా బాధ వినండి' అంటూ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల ఆందోళన

  • నిరసన చేపట్టిన ఉద్యోగులు
  • నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్
  • బాగున్నప్పుడు 119 విమానాలు తిప్పింది

‘మా బాధ వినండి, 9డబ్ల్యును ఎగరనివ్వండి’, ‘ఎయిర్ వేస్‌ను కాపాడండి, మా భవిష్యత్తును కాపాడండి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం మూడో టెర్మినల్ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు.

ఈ విమానయాన సంస్థ నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలను తాత్కాలిక సాయం కోరింది. ఆ నిధులతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంస్థ బాగున్నప్పుడు అత్యధికంగా 119 విమానాలను దేశీయ, విదేశీ మార్గాల్లో తిప్పింది. శని, ఆది వారాల్లో ప్రస్తుతం ఆ సంస్థ కేవలం ఆరు నుంచి ఏడు విమానాలను మాత్రమే తిప్పుతుందని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ వెల్లడించారు.

More Telugu News