Arjunreddy: పొగ తాగడం ఇష్టం లేకున్నా.. రోజుకు 20 సిగిరెట్లు తాగేవాడిని: హిందీ ‘అర్జున్‌రెడ్డి’

  • ధూమపానం అంత సులువైంది కాదు
  • పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదు
  • చెడును చూపించాలంటే ధూమపానం తప్పదు

విజయ్ దేవరకొండ హీరోగా ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం తనను తాను ఎలా మార్చుకోవాల్సి వచ్చిందో ‘కబీర్ సింగ్’ కథానాయకుడు షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కబీర్‌ సింగ్’లోని తన పాత్ర కోసం ఇష్టం లేకున్నా పొగ తాగాల్సి వచ్చిందట.

రోజుకు 20 సిగిరెట్లు, బీడీలు తాగేవాడినని షాహిద్ తెలిపాడు. ఆ తరువాత ఆ వాసన పూర్తిగా పోవడానికి రెండు గంటలపాటు స్నానం చేయాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. ధూమపానం అంత సులువైన పని కాదని, కానీ పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదన్నాడు. కబీర్‌లోని చెడును చూపించాలంటే ధూమపానం చెయ్యక తప్పలేదన్నాడు. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News