Andhra Pradesh: ఎండలకు ఓటర్లు అల్లాడిపోయారు.. నిర్వహణ లోపాలపై ఈసీ సమాధానం చెప్పాలి!: సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్

  • స్వాధీనం చేసుకున్న కోట్ల నగదు ఎవరిదో చెప్పాలి
  • పోలింగ్ సందర్భంగా వందల ఈవీఎంలు మొరాయించాయి
  • విజయవాడలో మీడియాతో సీపీఐ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు లోపాలు తలెత్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈ లోపాలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎండకు ఇబ్బంది పడుతున్న ఓటర్లకు ఎన్నికల అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. ఏపీ ఎన్నికల వేళ వందల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించాయని ఆరోపించారు.

విజయవాడలోని సీపీఐ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల డబ్బు ఎవరిదో ఈసీ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు-బీఎస్పీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News