kangana: 'బాహుబలి' కంటే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తాను: కంగనా రనౌత్

  • 'మణికర్ణిక'తో మరింత క్రేజ్ 
  • దర్శకత్వంపై పెరిగిన పట్టు 
  • మరో చారిత్రక చిత్రానికి సన్నాహాలు  

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో కంగనా ముందువరుసలో కనిపిస్తుంది. వివాదాలతో స్నేహం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా, వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఈ మధ్య ఆమె దర్శకత్వంలో వచ్చిన 'మణికర్ణిక' సంచలన విజయాన్ని నమోదు చేసింది. చారిత్రక నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా, నటిగా కంగనాకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టింది. దాంతో మరో చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో కంగనా వుంది.

తాను ప్రధాన పాత్రధారిగా నటించే ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించనున్నట్టు చెప్పింది. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా .. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా 'బాహుబలి' .. 'పద్మావత్' సినిమాలకి మించి ఉంటుందని అంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పింది. ప్రస్తుతం తాను చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, తన స్వీయ దర్శకత్వంలోని సినిమాపై దృష్టిపెడతానని ఆమె స్పష్టం చేసింది.

More Telugu News