bhadrachalam: భద్రాచలంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు

  • నిన్న ముగిసిన అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం 
  • ఈ సాయంత్రం సీతారాములకు ఎదురుకోలు ఉత్సవం
  • రేపు సీతారాముల కల్యాణం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న ఆలయంలో అగ్ని ప్రతిష్ఠ, ధ్వాజారోహణం, చతు:స్థానార్చనం కార్యక్రమాలను నిర్వహించారు. నిన్న సాయంత్రం బేరీ పూజ, దేవతాహ్వానం, బలిహరణం, హనుమంత వాహనంపై తిరువీధి సేవలను నిర్వహించారు. రేపు సీతారామ కల్యాణం, 15వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం సీతారాములకు ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 20వ తేదీన వేడుకలు ముగుస్తాయి.

మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కె.అప్పారావు సమక్షంలో కోటి తలంబ్రాలను శ్రీరాముడికి అప్పగించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 60 గ్రామాలకు చెందిన 3వేల మంది భక్తులు నాలుగు నెలల పాటు శ్రీరామ దీక్షను చేపట్టి ఈ తలంబ్రాలను తయారు చేశారు. ధాన్యాన్ని గోటితో ఒలిచి, నియమనిష్ఠలతో తలంబ్రాలు తయారు చేశారు. ఈ బియ్యపు గింజలను కలశాలలో పోసి, ఊరేగింపుగా వచ్చి ఆలయ ఈవో రమేశ్ బాబు చేతుల మీదుగా స్వామి వారికి అందించారు.

More Telugu News