Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆకట్టుకుంటున్న రకుల్ లుక్ 
  • డబ్బింగ్ పూర్తిచేస్తున్న మహేశ్ 
  • '90 ఎంఎల్' అంటున్న కార్తికేయ 

 *  అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో తాను చేస్తున్న 'దే దే ప్యార్ దే' చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంలో మరింత నాజూగ్గా కనిపించడం కోసం తొమ్మిది కిలోల బరువు కూడా తగ్గింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో నేటితో మహేశ్ తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తిచేయనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న విడుదల చేస్తారు.
*  'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ ఇప్పుడు బిజీ అవుతున్నాడు. అతను నటించిన 'హిప్పీ' చిత్రం విడుదలకు రెడీ కాగా, మరో మూడు చిత్రాలకు ఓకే చెప్పాడు. వీటిలో ఒక చిత్రానికి శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. దీనికి '90 ఎంఎల్' అనే ఆసక్తికరమైన టైటిల్ని నిర్ణయించారు.

More Telugu News